Janagaon: జనగామలో మహిళ నుంచి ఫోన్ లాక్కుని నానాయాగీ చేసిన కోతి... వీడియో ఇదిగో!

  • ఫోన్ మాట్లాడుతున్న మహిళ
  • లాక్కెళ్లి అరగంట పాటు ముప్పుతిప్పలు పెట్టిన కోతి
  • అరటి పండు ఇవ్వడంతో వదిలేసి వెళ్లిన వైనం

ఓ మహిళ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ను లాక్కున్న ఓ కోతి, దాదాపు అరగంట పాటు నానాయాగీ చేస్తూ, ముప్పుతిప్పలు పెట్టగా, అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జనగామలోని నెహ్రూ పార్క్ సమీపంలో జరిగింది.

ఇక్కడ నివాసం ఉంటున్న ఓ మహిళ, తన ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా, ఎక్కడి నుంచి వచ్చిందోగానీ, ఓ కోతి వచ్చి, ఆమె చేతిలోని ఫోన్ ను లాగేసుకుంది. దాన్ని ఏం చేయాలో తెలియక, అటూ ఇటూ తిరుగుతూ, దాన్ని ఇవ్వకుండా వింతగా ప్రవర్తించింది. ఫోన్ కోసం కోతి వెంటే తిరిగిన మహిళ, చివరకు ఓ అరటి పండును తెచ్చి దాని ముందు ఉంచడంతో, పండును తీసుకున్న కోతి, సెల్ ఫోన్ ను వదిలేసి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వీడియోను మీరూ చూడండి.

More Telugu News