Virat Kohli: వెరైటీగా రియాక్ట్ అయిన విరాట్ కోహ్లీ... వైరల్ అవుతున్న వీడియో!

  • నిన్న వెస్టిండీస్ తో మూడో టీ-20
  • విలియమ్స్ ను అనుకరించిన విరాట్ కోహ్లీ
  • సిక్స్ కొట్టిన తరువాత కళ్లు పెద్దవి చేసి ఆనందం

నిన్న వెస్టిండీస్ తో ముంబైలో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ-20లో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. 29 బంతుల్లో 70 పరుగులు చేసిన కోహ్లీ, నాలుగు ఫోర్లు, ఏడు సిక్స్ లు బాదాడు. ఈ క్రమంలో కోహ్లీ రియాక్షన్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెస్టిండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్ ను కోహ్లీ అనుకరించడమే ఇందులో విశేషం. తొలుత విలియమ్స్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి కాస్తంత ఇబ్బంది పడ్డట్టు కనిపించిన కోహ్లీ, ఆ తరువాత రెచ్చిపోయాడు. విలియమ్స్ బౌలింగ్ లో భారీ సిక్స్ కొట్టిన తరువాత, వికెట్ తీసిన సమయంలో అతను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో, అలాగే ఆ సిక్స్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు. కళ్లు పెద్దవిగా చేసి బాల్ ను చూస్తూ ఆనందించాడు. ఆపై బౌలర్ వద్దకు వెళ్లి తన నోటికి కూడా పని చెప్పాడు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News