Chiranjeevi: వైఎస్ జగన్ సర్కారును అభినందించిన మెగాస్టార్ చిరంజీవి!

  • ఏపీలో రానున్న 'దిశ చట్టం'
  • అత్యాచారం చేస్తే మరణదండనే
  • కఠిన శిక్ష ఉండాల్సిందేనన్న చిరంజీవి

ఆంధ్రప్రదేశ్ లో అతివలకు అండగా నిలిచేలా 'ఏపీ దిశ చట్టం' తీసుకు రానుండడాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. మహిళలపై అత్యాచారాలు చేసే వారికి మరణ దండన విధించడమే సరైన శిక్షని చిరంజీవి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, దోషులకు మరణదండన విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఏపీ కేబినేట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సర్కారు సరైన చర్యలు తీసుకుందని, ఇటువంటి చట్టాన్ని తొలుత తెలుగు రాష్ట్రమైన ఏపీ తీసుకురావడం గర్వకారణమని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు కేసుల్లో కఠిన శిక్షలు పడితే, ఆపై ఎవరూ అమ్మాయిల జోలికి వెళ్లబోరని, ఆ భయం నేరస్తుల్లో పెరగాలని అభిప్రాయపడ్డారు.

More Telugu News