ఇదిగో సెన్సార్ సర్టిఫికెట్... ఇప్పుడెవరు అడ్డుకుంటారో రండి!: వర్మ

11-12-2019 Wed 19:08
  • అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్!
  • ట్వీట్ చేసిన వర్మ
  • తన సినిమా షెడ్యూల్ ప్రకారమే విడుదల అవుతోందని వెల్లడి

ప్రతి ఒక్కరికీ దుర్వార్త అంటూ రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో కలకలం రేపారు. తన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారందరికీ ఇది చెడు వార్త అని వ్యాఖ్యానించారు. సెన్సార్ బోర్డుతోనూ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, కేసులు కూడా ఓ కొలిక్కి వచ్చాయని తెలిపారు.

మీ చెత్త కుయుక్తులతో సినిమాను అడ్డుకోవడానికి మగాళ్లు, జోకర్లు ఇప్పుడు రండి అంటూ సవాల్ విసిరారు. రాజ్యాంగం అందించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను మాత్రం ఎవరూ అడ్డుకోలేరని, షెడ్యూల్ ప్రకారమే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం డిసెంబరు 12న రిలీజ్ అవుతోందని ట్వీట్ చేశారు. అంతేకాదు, సెన్సార్ సర్టిఫికెట్ ను కూడా తన పోస్టుకు జత చేశారు.