Prabhas: భారీ సెట్స్ సిద్ధం .. రంగంలోకి ప్రభాస్

  • ప్రభాస్ తాజా చిత్రంగా 'జాన్'
  • అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ సెట్స్ 
  • వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల

ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'జాన్' పైనే వుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ కి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియో (సెవెన్ ఏకర్స్) లో మూడు భారీ సెట్స్ వేస్తున్నారు. అవి ముగింపు దశకి చేరుకున్నాయి.

జనవరి మొదటి వారం నుంచి ఆ సెట్స్ లో మేజర్ పార్టు షూటింగు జరపనున్నారు. నాన్ స్టాప్ గా జరిగే ఈ షూటింగులో పాల్గొనడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. 1960 - 70 కాలం నేపథ్యంలోని ప్రేమ కథాంశంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రీమంతుడిగా ప్రభాస్ .. పేదరాలైన యువతిగా పూజా హెగ్డే కనిపించనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News