Sanju Samson: యువ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు మరోసారి మొండిచేయి

  • తొలి రెండు టి20ల్లో దక్కని చాన్స్
  • వన్డే టీమ్ లోనూ నో ప్లేస్
  • ఇంకా కోలుకోని ధావన్
  • ధావన్ ప్లేస్ లో మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసిన సెలెక్టర్లు

భారత దేశవాళీ క్రికెట్లో ఇప్పటికిప్పుడు అత్యుత్తమ ఫామ్ లో ఉన్న ఆటగాడు ఎవరంటే కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ పేరే వినిపిస్తుంది. కానీ ఈ సంచలన ఆటగాడికి టీమిండియా తుది జట్టులో మాత్రం స్థానం దక్కడంలేదు. వెస్టిండీస్ తో సిరీస్ కు జాతీయ జట్టుకు ఎంపికైనా, ఇప్పటికీ రిజర్వ్ ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. తొలి రెండు టీ20ల్లో సంజూ శాంసన్ ను పక్కనబెట్టిన టీమిండియా మేనేజ్ మెంట్ మూడో టీ20 మ్యాచ్ లో ఈ కేరళ ఆటగాడికి అవకాశం ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా వన్డే జట్టుకు సైతం శాంసన్ ను సెలెక్టర్లు పట్టించుకోలేదు.

వాస్తవానికి విండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు కొన్నిరోజుల కిందటే జట్టును ప్రకటించారు. అప్పుడు శాంసన్ ను ఎంపిక చేయలేదు. అయితే గాయపడిన శిఖర్ ధావన్ ఇప్పటికీ కోలుకోకపోవడంతో అతడిస్థానంలో శాంసన్ ను తీసుకుంటారని భావించినా, సెలెక్టర్లు మయాంక్ అగర్వాల్ వైపు మొగ్గారు. టెస్టుల్లో పరుగులు వెల్లువెత్తిస్తున్న మయాంక్ ను ధావన్ ప్లేస్ లో ఓపెనింగ్ చేయించే అవకాశాలున్నాయి. మొత్తానికి మరోసారి సంజూ శాంసన్ కు తీవ్ర నిరాశ తప్పలేదు.

More Telugu News