PSLV C48: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-48

  • సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-48 
  • భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్ 1 ఉపగ్రహాన్ని తీసుకెళ్లిన రాకెట్
  • మరో 9 విదేశీ ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టనున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన రీశాట్ 2 బీఆర్ 1 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. విదేశీ ఉపగ్రహాల్లో అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, ఇటలీ, ఇజ్రాయెల్, జపాన్ లకు చెందిన ఒక్కో శాటిలైట్ ఉన్నాయి. పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 50వ ప్రయోగం కావడం గమనార్హం.

More Telugu News