nagababu: కన్నబాబుకి కామెడీ ఎక్కువ: నాగబాబు

  • ఉల్లిపాయ నిత్యావసర వస్తువు కాదు అంటూ వ్యాఖ్య
  • వీడియో పోస్ట్ చేసిన జనసేన శతఘ్ని
  • నిత్యావసర వస్తువుకు అర్థం తెలీదని ఎద్దేవా
  • రీట్వీట్ చేసిన నాగబాబు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుపై సినీనటుడు నాగబాబు సెటైర్ వేశారు. 'కన్నబాబు కి కామెడీ ఎక్కువ' అంటూ ట్వీట్ చేశారు. జనసేన శతఘ్ని టీమ్ పోస్ట్ చేసిన ఓ వీడియోను ఆయన రీట్వీట్ చేశారు. 'రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి పాయలు అమ్ముతున్నాం. ఉల్లిపాయలు నిత్యావసర వస్తువు కాదు.. ఉల్లి పాయలు మనం తినే రెగ్యులర్ గా వాడుకునే వస్తువులే తప్ప' అని కురసాల కన్నబాబు అన్నట్లు ఈ వీడియోలో ఉంది.

'రెగ్యులర్ గా వాడే వస్తువుని నిత్యావసర వస్తువు అంటారు అనే ఇంగిత జ్ఞానం లేని మంత్రి కురసాల కన్నబాబు' అని  జనసేన శతఘ్ని ఈ వీడియోను పోస్ట్ చేసింది. దీనిపైనే స్పందించిన నాగబాబు ఆయనకు చురక అంటించారు.

More Telugu News