paytm: పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న విజయ్‌శేఖర్‌ శర్మ

  • ఈ నెల 2న  విజయ్‌శేఖర్‌ రాజీనామా లేఖ 
  • ఇతర బాధ్యతలు కూడా ఉన్న నేపథ్యంలోనే నిర్ణయం అంటూ లేఖ
  • ఆర్బీఐ నిబంధనలే కారణం?

పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను పేటీఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బోర్డుకు పంపారు. తనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్న నేపథ్యంలోనే తాను ఈ పదవినుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. ఈ నెల 2న ఆయన ఈ లేఖ రాశారని పేర్కొంది.  

ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన నిబంధనల కారణంగానే విజయ్ శర్మ పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. చెల్లింపుల బ్యాంక్ ఛైర్మన్‌ ఎన్‌బిఎఫ్‌సిలో డైరెక్టర్ పదవిని చేపట్టడంపై రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. బ్యాంకుకు చెందిన సబ్సిడరీగా పేమెంట్‌ సంస్థ ఉంటేనే డైరెక్టర్‌ పదవిలో ఛైర్మన్‌ ఉండాలని తెలిపింది.

More Telugu News