Rajyasabha: కొన్ని పార్టీలకు, పాకిస్థాన్ కు తేడా లేకుండా పోయింది: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు 
  • బీజేపీ నేతలతో సమావేశమైన మోదీ
  • విపక్షాల కామెంట్లపై మండిపాటు

ఇండియాలోని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలకు, పాకిస్థాన్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకూ తేడా లేకుండా పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన, పౌరసత్వ బిల్లు గురించి ప్రస్తావించారు. నేడు రాజ్యసభకు బిల్లు రానుండగా, ఈ బిల్లు దేశ భవిష్యత్ కు దిశా నిర్దేశంగా నిలుస్తుందని అన్నారు.

ఈ బిల్లుతో నష్టం అధికమని పాకిస్థాన్ చెబుతోందని గుర్తు చేస్తూ, పక్క దేశాల వ్యవహారాలపై వారికి అవసరం ఏంటని ప్రశ్నించారు. పాక్ నేతలు మాట్లాడుతున్నట్టుగానే, కొన్ని పార్టీలు కామెంట్లు చేస్తున్నాయని మోదీ అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టాలన్నది తమ మేనిఫెస్టోలోనే ఉందని, ఇచ్చిన హామీని ఇప్పుడు అమలులోకి తీసుకుని వస్తున్నామని ఆయన అన్నారు. కాగా, పౌరసత్వ బిల్లు నేటి మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ ముందుకు రానుండగా, తమ ఎంపీలకు కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News