వివేకా హత్య వెనుక నేనున్నానని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటా: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి!

11-12-2019 Wed 09:39
  • కావాలనే నా పేరు తెస్తున్నారు
  • ఈ ఉదయం 8 గంటలకు నోటీసులు అందాయి
  • సిట్ విచారణకు హాజరు కాబోతున్నాను

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, ప్రభుత్వం, పోలీసులు కావాలనే తన పేరును తెరపైకి తెస్తున్నారని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, వివేకా హత్యతో తనకు సంబంధముందని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని అన్నారు.

 కాగా, ఈ కేసులో విచారణకు రావాలని ఆదినారాయణరెడ్డికి కేసును విచారిస్తున్న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్వగ్రామమైన జమ్మలమడుగు మండలం దేవగుడిలో ఈ నోటీసులను అధికారులు ఆదినారాయణరెడ్డికి ఇచ్చారు. నోటీసులపై స్పందించిన ఆది, కడపకు వెళ్లి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నానని అన్నారు. తనకు ఈ ఉదయం 8 గంటలకు నోటీసులు అందాయని ఆయన చెప్పారు.