Karnataka: ఇచ్చిన హామీ ప్రకారం ఉప ఎన్నికల్లో గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తాం: యడియూరప్ప

  • ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో బీజేపీ గెలుపు
  • ఓడిన అభ్యర్థులకూ మంత్రి పదవులు
  • ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌ షాలను కలవనున్న సీఎం

కర్ణాటక ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవులు ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసి ఈ విషయమై చర్చించనున్నట్టు చెప్పారు. అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరిస్తామన్నారు.

పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వచ్చిన నాయకులు ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు దానిని నెరవేర్చుకునేందుకు కృషి చేస్తానని అన్నారు. డిసెంబరు 5న కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో 12 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఓడిపోయిన ఇద్దరు అభ్యర్థులు ఏహెచ్ విశ్వనాథ్, ఎంబీటీ నాగరాజులకు కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News