janasena: ఈ నెల 12న కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష: పవన్ కల్యాణ్

  • కన్నీళ్లు పెట్టిస్తున్న ధాన్యం రైతుల కష్టాలు
  •  రైతుల మాటలు విన్నాక చెప్పలేనంత బాధ కలిగింది
  • కాకినాడలో  ‘రైతు సౌభాగ్య దీక్ష’కు సంకల్పించా

మన రాష్ట్రంలో సగటున 50 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఏటా పండుతుండగా అందులో 25 లక్షల క్వింటాళ్లు ఉభయగోదావరి జిల్లాల్లోనే పండుతోందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గిట్టుబాటు ధర లేక, ఖర్చులు సైతం రాబట్టుకోలేక వరి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారని చెప్పారు.

అనేకమంది ధాన్యం రైతులు తనను కలిసి వారి కష్టాల గురించి చెప్పారని అన్నారు. రైతుల పరిస్థితి స్వయంగా తెలుసుకుందామని గత ఆదివారం మండపేట, దాని పరిసర ప్రాంతాలలో పర్యటించానని, రైతులతో స్వయంగా మాట్లాడానని చెప్పారు. రైతుల మాటలు విన్న తర్వాత చెప్పలేనంత బాధ కలిగిందని, వారి దుస్థితిని సీఎం జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 12 తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్షకు సంకల్పించానని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ సందర్భంగా రైతు సౌభాగ్య దీక్ష’ పోస్టర్ పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.

More Telugu News