Warangal: సమత ఘటనలో నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలి: డీకే అరుణ

  • ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి
  • వరంగల్ లో మానస కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
  • రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం నియంత్రించాలి

వరంగల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల గురించి బీజేపీ నేత డీకే అరుణ ప్రస్తావించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ లో మానస అత్యాచారం, హత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో సమత అత్యాచార ఘటనలో నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని అన్నారు. సమత కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం నియంత్రించాలని, మద్యం నియంత్రణపై ఈ నెల 12, 13 తేదీల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.

More Telugu News