‘2019 గోల్డెన్ ట్వీట్’ గా మోదీ చేసిన నినాదం: ట్విట్టర్ ప్రకటన

10-12-2019 Tue 15:50
  • ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ = విజయీ భారత్’ ట్వీట్
  • ఇప్పటివరకు ఈ ట్వీట్ కు నాలుగు లక్షల ఇరవై వేల లైక్ లు  
  • లక్షా పదిహేడువేలకు పైగా రీట్వీట్ల నమోదు

ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్  దేశంలో అత్యంత విలువైన ట్వీట్ గా ఈ ఏడాది నిలిచింది. ఈ మేరకు ట్విట్టర్ ఒక ప్రకటన చేసింది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా మోదీ  ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ (ఇవన్నీ కలిస్తే) = విజయీ భారత్(విజయ భారత్) అంటూ ఇచ్చిన నినాదం సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్లో ప్రజల ఆదరణను చూరగొంది. ఈ ట్వీట్ ను భారత్ ‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019’ గా ట్విట్టర్ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ ట్వీట్ కు నాలుగు లక్షల ఇరవై వేల లైక్ లు రాగా, లక్షా పదిహేడువేలకు పైగా రీట్వీట్లు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ట్విట్టర్లో మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల్లో మూడో స్థానంలో నిలిచారు.