అప్పుడు మాత్రం కేవీ రెడ్డిపై అక్కినేనికి చాలా కోపం వచ్చేసిందట!

10-12-2019 Tue 14:46
  • అన్నపూర్ణ బ్యానర్లో రూపొందిన 'దొంగరాముడు'
  • అక్కినేని ఎక్స్ ప్రెషన్ నచ్చలేదన్న కేవీరెడ్డి
  • కోపాన్ని పక్కన పెట్టేసిన అక్కినేని 

సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ .. 'దొంగరాముడు' సినిమాను గురించి మాట్లాడుతూ, ఆ సినిమా షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. 'దర్శకుడు కేవీ రెడ్డి గారి కోసం ఏడాదికి పైగా వేచి వుండి, అన్నపూర్ణ బ్యానర్లో 'దొంగరాముడు' సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఏఎన్నార్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కేవీ రెడ్డిగారికి సంతృప్తికరంగా అనిపించలేదు.

'మీ ఎక్స్ ప్రెషన్ సహజంగా లేదు .. వాంతి చేసుకుంటున్నట్టుగా వుంది' అని కేవీ రెడ్డిగారు అన్నారట. ఆ మాటకి అక్కినేనికి కోపం వచ్చేసింది. 'అయితే షూటింగ్ కేన్సిల్ చేయండి' అంటూ ఆయన అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు. అక్కినేని అలా అంటాడని ఊహించని కేవీరెడ్డిగారు షాక్ అయ్యారు. అంతకుముందు జమునగారితో తీసిన షాట్ కూడా అనుకున్నట్టుగా రాకపోవడం వలన, ఆ చికాకులో కేవీరెడ్డి గారు అలా అని వుంటారని సన్నిహితులు నచ్చజెప్పడంతో, అక్కినేని మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు" అని చెప్పుకొచ్చారు.