Gujarathi sangeet: ప్రీ వెడ్డింగ్ షూట్స్ పై మధ్యప్రదేశ్ జైన్, గుజరాతీ సంస్థల నిషేధం

  • ఆధ్యాత్మిక నాయకుల సూచనతో నిషేధం
  • భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సభ్యులు
  • వ్యతిరేకిస్తే సంఘం నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరిక

వివాహ వేడుకల సందర్భంగా నిర్వహించే ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడాన్ని, సంగీత్ కార్యక్రమాల కోసం మహిళలకు మగ డాన్సర్స్ తో శిక్షణ ఇప్పించడాన్ని మధ్యప్రదేశ్ జైన్, గుజరాతీ సంస్థలు నిషేధించాయి. ఈ విషయాన్ని ఇరు సంస్థలు తమ సభ్యులకు ఓ సర్క్యులర్ ద్వారా తెలియజేసినట్లు భోపాల్ గుజరాత్ సేవా సమాజ్ ప్రధాన కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.

సంగీత్ కార్యక్రమం సందర్భంగా తమ కుటుంబాలకు చెందిన మహిళలకు మగ డాన్సర్స్ తో శిక్షణ ఇప్పించడం తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని ఆధ్యాత్మిక నేతలు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పటేల్ పేర్కొన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని జైన్, గుజరాతీ కమ్యూనిటీకి చెందిన అందరూ స్వాగతిస్తున్నారని, ఒకవేళ తమ ఆదేశాలను కాదని ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్, సంగీత్ కోసం మహిళలకు డాన్స్ లో శిక్షణ ఇప్పించడం వంటి చర్యలకు పాల్పడితే వారిని తమ సంఘం నుంచి బహిష్కరిస్తామని పటేల్ హెచ్చరించారు. వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న గుజరాతీయులు అందరూ దీన్ని పాటించాలని ఆయన ఆదేశించారు.

అయితే ఈ నిర్ణయాన్ని కొందరు సభ్యులు తప్పు పడుతున్నారు. సంగీత్ అనేది పాత స్మృతులను మననం చేసుకునే కార్యక్రమం అని, కాబోయే భార్యా భర్తల ఫొటో షూట్ అనే విషయంలో కూడా తప్పు పట్టాల్సిన అంశం ఏదీ లేదని కొందరు వాదిస్తుండడం విశేషం.

More Telugu News