వంశీ తిరిగి ఎమ్మెల్యే కాలేరు... జగన్ కూడా టికెట్ ఇవ్వరు: చినరాజప్ప

10-12-2019 Tue 14:43
  • వల్లభనేని వంశీపై చినరాజప్ప ఫైర్
  • అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత
  • మళ్లీ గెలవలేనన్న కారణంతోనే వంశీ రాజీనామా చేయలేదని విమర్శ

ఏపీ మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.​ వంశీ మరోసారి ఎమ్మెల్యే కాలేరని, ఆయనకు జగన్ కూడా టికెట్ ఇవ్వబోరని అన్నారు. మళ్లీ పోటీ చేస్తే గెలవలేనన్న కారణంతోనే వంశీ పదవికి రాజీనామా చేయలేదని విమర్శించారు. జగన్ కు దమ్ముంటే వంశీతో రాజీనామా చేయించాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. స్వలాభం కోసమే పార్టీ మారిన వంశీ, తన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమే ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తుల కోసమే వంశీ ఏవేవో మాట్లాడుతున్నారని చినరాజప్ప వ్యాఖ్యానించారు.