మహేశ్ హిట్ కొట్టడం ఖాయమంటున్న రాజేంద్రప్రసాద్

10-12-2019 Tue 14:16
  • కీలకమైన పాత్రలో కనిపిస్తాను 
  •  కొత్త మహేశ్ బాబును చూస్తారు 
  •  అనిల్ ప్రత్యేకత అర్థమైందన్న రాజేంద్రప్రసాద్ 

మహేశ్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'సరిలేరు నీకెవ్వరు' విడుదలకి ముస్తాబవుతోంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాను గురించి రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ .. "ఈ సినిమాలో నేను కీలకమైన పాత్రను పోషించాను. ఇంతవరకూ చేసిన పాత్రలకి భిన్నంగా ఈ పాత్ర ఉంటుంది.

నా పాత్రకి సంబంధించిన డబ్బింగ్ ను కూడా పూర్తిచేశాను. సినిమా చాలా బాగా వచ్చింది .. అనిల్ రావిపూడి ప్రతి పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడు. ఆయన ప్రత్యేకత ఏమిటనేది నాకు అర్థమైంది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కొత్త మహేశ్ బాబు కనిపిస్తాడు. ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుంది .. మహేశ్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గా చేరిపోతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.