అంటార్కిటికా వెళుతున్న చిలీ విమానం అదృశ్యం

10-12-2019 Tue 14:14
  • పుంటా అరేనస్ నుంచి బయల్దేరిన విమానం
  • కొద్దిసేపటికే రాడార్ పై మిస్సింగ్
  • విమానంలో 38 మంది

అంటార్కిటికా మంచుఖండంలో ఉన్న వైమానిక స్థావరానికి చేరాల్సిన చిలీ దేశానికి చెందిన విమానం అదృశ్యమైంది. హెర్క్యులస్ సి130 శ్రేణికి చెందిన ఈ రవాణా విమానం చిలీలోని పుంటా అరేనస్ నుంచి సోమవారం సాయంత్రం బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. రాడార్ పై విమానం ఆచూకీ కనిపించలేదు. దాంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ రవాణా విమానంలో 17 మంది సిబ్బంది సహా మొత్తం 38 మంది ఉన్నారు.