imran khan: అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్‌ ఉల్లంఘించింది: పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  • 'పౌరసత్వ సవరణ బిల్లు'పై ఇమ్రాన్ అభ్యంతరాలు
  • పాక్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడిచింది
  • హిందూ దేశ భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది

దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే బిల్లుకు గత అర్ధరాత్రి లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందిస్తూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్‌ ఉల్లంఘించిందని చెప్పుకొచ్చారు.

అలాగే, తమ దేశంతో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్‌ తూట్లు పొడిచిందని అన్నారు. ఈ  బిల్లుపై ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించడం గమనార్హం. హిందూ దేశ భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందంటూ ఆర్ఎస్ఎస్ అనడం సరికాదని అన్నారు. కాగా, ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లు పట్ల మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News