పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్

10-12-2019 Tue 13:15
  • ఏడాది క్రితం రోహిత్ మిట్టల్ ను పెళ్లాడిన శ్వేత
  • పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు తెలిపిన శ్వేత
  • మంచి భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్య

తన భర్తతో విడిపోతున్నట్టు సినీ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ వెల్లడించింది. సినీ రంగానికే చెందిన రోహిత్ మిట్టల్ ను ఏడాది క్రితం ఆమె పెళ్లాడింది. సంవత్సరం కూడా తిరక్కుండానే వీరు విడాకులు తీసుకుంటున్నారు.

తమ వివాహబంధానికి ముగింపు పలకాలని తాను, రోహిత్ పరస్పరం అంగీకారానికి వచ్చామని శ్వేత తెలిపింది. లోతుగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఇరువురి భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ప్రతి పుస్తకాన్ని మనం పూర్తిగా చదవలేకపోవచ్చని... దీని అర్థం ఆ పుస్తకం బాగోలేదని కాదని చెప్పింది. తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు, తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు రోహిత్ కు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపింది. రోహిత్ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని ఆకాంక్షించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ సినిమాల్లో శ్వేత నటించింది.