'రేప్ ఇన్ ఇండియా' దిశగా భారత్ వెళ్తోంది: లోక్ సభలో అధీర్ రంజన్ చౌదరి

10-12-2019 Tue 13:03
  • మరోసారి కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
  • ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విషయాలపై మాట్లాడతారు
  • దేశంలో మహిళలపై జరుగుతోన్న దాడులపై మాత్రం మాట్లాడట్లేదు

కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి లోక్ సభలో మాట్లాడుతూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ప్రధాని నరేంద్ర మోదీ అన్ని విషయాలపై మాట్లాడతారు.. కానీ, దేశంలో మహిళలపై జరుగుతోన్న దాడులపై మాత్రం ఆయన మాట్లాడకపోవడం దురదృష్టకరం. మేక్ ఇన్ ఇండియా నుంచి భారత్ మెల్లిగా రేప్ ఇన్ ఇండియా దిశగా వెళ్తోంది' అని వ్యాఖ్యానించారు.

కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై అధీర్ రంజన్ చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. చివరకు తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇటీవలే లోక్‌సభలో క్షమాపణలు చెప్పారు. ఆ సంఘటన మరవకముందే మరోసారి లోక్ సభలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.