'హెరిటేజ్ ఫ్రెష్'లో ఉల్లి ధరలపై చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి స్పందన

10-12-2019 Tue 12:35
  • అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు
  • నేను అసెంబ్లీ సమావేశాలను చూడను
  • హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు మాకింద లేదు
  • ఫ్యూచర్ గ్రూప్ కింద నడుస్తోంది

హెరిటేజ్ ఫ్రెష్ లో అధిక ధరలకు ఉల్లిపాయలను అమ్ముతున్నారంటూ అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి స్పందించారు. ఈ రోజు ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను అసెంబ్లీ సమావేశాలను చూడను. హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు మాకింద లేదు. హెరిటేజ్ ఫ్రెష్ ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తోంది' అని వ్యాఖ్యానించారు.
 
కాగా, ఉల్లి ధరల పెరుగుదలపై నారా భువనేశ్వరి మాట్లాడుతూ... తన జీవితంలో ఎన్నడూ ఇంత అధిక రేట్లను చూడలేదని అన్నారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా చొరవచూపి చర్యలు తీసుకోవాలని అన్నారు. సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, క్యూలో నించొని ఉల్లి కూడా కొనలేని పరిస్థితుల్లో వెనుదిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.