సాక్షి పేపరులో తప్పుగా రాశారు: శాసనసభలో సీఎం జగన్

10-12-2019 Tue 12:12
  • మేనిఫెస్టోలో సన్న బియ్యం ప్రస్తావనే లేదు
  • నాణ్యమైన బియ్యం ఇస్తామనే చెప్పాం
  • నాణ్యమైన బియ్యం, సన్న బియ్యంకు తేడా తెలియకుండా పత్రికల్లో రాశారు

సన్న బియ్యంపై ఏపీ శాసనసభ అట్టుడికింది. అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. తమ మేనిఫెస్టోలో సన్న బియ్యం ప్రస్తావనే లేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. నాణ్యమైన బియ్యం ఇస్తామనే తాము చెప్పామని అన్నారు. ఈ అంశంపై సాక్షి పత్రికలో తప్పుగా రాశారని... నాణ్యమైన బియ్యం, సన్న బియ్యానికి తేడా తెలియకుండా రాశారని చెప్పారు.

అదే రోజు ఇతర పేపర్లలో వచ్చిన వార్తను కూడా చూడాలని అన్నారు. మీ మాదిరే వాళ్లు కూడా నాణ్యమైన బియ్యం, సన్న బియ్యానికి తేడా తెలియక కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పారు. స్వర్ణ బియ్యాన్నే సన్న బియ్యం అంటారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇస్తుంటే... ఓర్చకోలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము ఇస్తున్న బియ్యంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.