nirbhaya: 'నిర్భయ' దోషులను ఉరి తీసే అవకాశం ఇవ్వండి.. డబ్బు కూడా వద్దు: తీహార్‌ జైలు డీజీపీకి కానిస్టేబుల్ లేఖ

  • త్వరలోనే నిర్భయ దోషులకు ఉరి అమలు
  • ఉరి తీయడానికి తలారి అందుబాటులో లేడంటూ ప్రచారం 
  • డీజీపీకి లేఖ రాసిన తమిళనాడుకు చెందిన సుభాష్ శ్రీనివాసన్

నిర్భయ కేసులో నలుగురు దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలు చేసేందుకు తీహార్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీయడానికి తలారి అందుబాటులో లేడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  తమిళనాడుకు చెందిన ఓ పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ ఆ పని కోసం తనను నియమించాలని కోరుతున్నారు.
 
ఈ విషయంపై తీహార్‌ జైలు డీజీపీకి సుభాష్‌ శ్రీనివాసన్‌ అనే కానిస్టేబుల్ లేఖ రాశారు. నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం తనకు ఇవ్వాలని, ఈ పని కోసం డబ్బులు కూడా తీసుకోనని అంటున్నాడు. ఆ పని ఎంతో గొప్పది కాబట్టి తనకు అక్కడ పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరాడు. ఆ కానిస్టేబుల్ సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.  అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం వంటి పనులు చేయడమే కాకుండా, ప్రజలకు మంచి నీటి ఉచిత సరఫరా వంటి పనులు చేస్తుంటాడు.

More Telugu News