Sudheer: ఆ ట్యూమర్ వల్ల ఏడాది పాటు నరకం అనుభవించాను: 'సుడిగాలి' సుధీర్

  • ట్యూమర్ చాలా బాధ పెట్టింది 
  • సర్జరీ గురించి డాక్టర్లు అలా చెప్పారు 
  • ఎన్నో రాత్రులు ఏడ్చానన్న సుధీర్

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'సుడిగాలి' సుధీర్ మాట్లాడుతూ, తనని తీవ్రమైన ఆందోళనకి గురిచేసిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. "ఒకసారి నాకు వెన్నెముకకు సంబంధించిన నరాలపై 'ట్యూమర్' వచ్చింది. అది ఎందుకు వచ్చిందో .. అది కేన్సర్ ట్యూమరా? నాన్ కేన్సర్ ట్యూమరా? అనేది కూడా తెలియదు.

సర్జరీ కొంచెం క్రిటికల్ అన్నారు .. సక్సెస్ కాకపోతే కాళ్లు పనిచేయవని చెప్పారు. ఆ సమయంలోను .. ఆ ట్యూమర్ శాంపిల్ ను బయాప్సికి పంపించిన సమయంలోను చాలా భయపడ్డాను. ఆ ట్యూమర్ వలన ఒక ఏడాదిపాటు నరకం అనుభవించాను. ఎందుకు బతికి వున్నానురా బాబూ అనిపించేది. శత్రువులకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకునేవాడిని. కదలకుండా కూర్చునే నిద్రపోవాలి .. మెడ పక్కకి తిప్పినా కరెంట్ షాక్ కొట్టినంత బాధ కలిగేది. అమ్మానాన్నలకి తెలియకుండా నేను ఏడ్చిన రాత్రులు ఎన్నో వున్నాయి" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News