NTR: ఎన్టీఆర్ వ్యవహారంలో నేను కూడా ఉన్నా.. పశ్చాత్తాపపడుతున్నా!: స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు

  • ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయానికి విచారిస్తున్నా
  • విచక్షణాధికారంతోనే వల్లభనేని వంశీకి అవకాశమిచ్చా
  • అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చారన్న చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వ్యవహారంలో తాను కూడా ఉన్నానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయం పట్ల తాను చాలా విచారిస్తున్నానని చెప్పారు. ఆ పాపంలో తాను కూడా ఉన్నానని, దానికి పశ్చాత్తాపపడుతున్నానని తెలిపారు. ఆ పనిలో భాగస్వామినైనందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నానని అన్నారు.

స్పీకర్ గా తనకున్న విచక్షణాధికారంతోనే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు వల్లభనేని వంశీకి అవకాశమిచ్చానని తమ్మినేని చెప్పారు. ప్రశ్నోత్తరాలను పక్కనపెట్టి ఓ సభ్యుడితో మాట్లాడించారంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా మార్చారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అసెంబ్లీ ఎవరి జాగీరు కాదని... ప్రజల జాగీరని తెలిపారు.

More Telugu News