Pawan Kalyan: మత మార్పిళ్లపై పెట్టిన దృష్టిని ఉల్లిపాయలపై పెడితే బాగుండేది: పవన్ కల్యాణ్

  • ఉల్లిపాయల కోసం జనాలు క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది
  • గ్రామ వాలంటీర్లతో ఉల్లిపాయలను సరఫరా చేయించండి
  • అవసరమైతే 'జగనన్న ఉల్లిపాయల పథకం' అని పేరు పెట్టుకోండి

ఆకాశాన్నంటిన ఉల్లి ధరలతో ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కిలో రూ. 25కి ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. వీటి కోసం జనాలు పెద్దపెద్ద క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. సాంబయ్య రెడ్డి అనే వ్యక్తి క్యూలైన్లో నిలబడి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అనుభవ రాహిత్యమే ఈ సంక్షోభానికి కారణమని చెప్పారు.

ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. ఉల్లి సరఫరా కోసం గ్రామ వాలంటీర్లను ఉపయోగించి... ప్రజల ఇళ్ల దగ్గరికే రూ. 25కి ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయడం లేదని అన్నారు. అవసరమైతే దీనికి 'జగనన్న ఉల్లిపాయ పథకం' అనే పేరు పెట్టుకోండని ఎద్దేవా చేశారు.

మత మార్పిళ్లు, కూల్చివేతలు, కాంట్రాక్టు రద్దుల మీద పెట్టిన దృష్టిని వైసీపీ ప్రభుత్వం ప్రజల అవసరాల మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేదని పవన్ కల్యాణ్ అన్నారు.

More Telugu News