NRC: పౌరసత్వ బిల్లు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది: అధిర్ రంజన్ చౌదరి

  • దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది
  • సమానత్వ హక్కుకు వ్యతిరేకంగా ఈ బిల్లు వుంది
  • దేశ లౌకిక వాదానికి, సమగ్రతకు ఇది విఘాతం

లోక్ సభలో జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, మైనార్టీలకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకంగా ఈ బిల్లు ఉందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. దేశ లౌకిక వాదానికి, సమగ్రతకు ఇది విఘాతం కలిగిస్తుందని అన్నారు. మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ మాట్లాడుతూ, మహాత్ముల ఆశయాలకు తూట్లు పొడుస్తూ పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగ ప్రవేశికకు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకంగా వుందని విమర్శించారు.

More Telugu News