అజహరుద్దీన్ తనయుడికి సానియా మీర్జా సోదరికి పెళ్లి!

09-12-2019 Mon 15:12
  • ప్రేమలో ఉన్న అసద్, ఆనమ్
  • ఇటీవలే నిశ్చితార్థం!
  • పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు

హైదరాబాద్ నగరంలో మరో సెలబ్రిటీ మ్యారేజికి తెరలేచింది. క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్ తనయుడు అసద్ అజహరుద్దీన్ కు, టెన్నిస్ రారాణి సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జాతో త్వరలోనే పెళ్లి జరగనుంది. అసద్, ఆనమ్ గతకొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆనమ్ కు గతంలో అక్బర్ రషీద్ తో వివాహం జరగ్గా, ఆ బంధం నిలవలేదు. ఆ తర్వాత అసద్ తో ఆనమ్ కు పరిచయం జరగడంతో అది ప్రేమగా మారింది. ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. డిసెంబరు మూడోవారంలో అసద్, ఆనమ్ ల వివాహం జరగనుందని తెలుస్తోంది. పెళ్లికి ఏర్పాట్లు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సానియా సోదరి ఆనమ్ తన మిత్రబృందం కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.