SBI: ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లను తగ్గించిన ఎస్ బీఐ... మరింత చౌకగా రుణాలు!

  • గృహ, కారు రుణాలపై తక్కువ వడ్డీరేటు
  • 10 బేసిస్ పాయింట్లు తగ్గిన ఎంసీఎల్ఆర్ వడ్డీరేటు
  • డిసెంబరు 10 నుంచి అమల్లోకి

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మరోసారి ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లను తగ్గించింది. బ్యాంకులకు నిధులు లభ్యమయ్యే రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఎస్ బీఐ తాజా నిర్ణయంతో ఎంసీఎల్ఆర్ వడ్డీరేటు 8.00 శాతం నుంచి 7.90 శాతానికి 10 బేసిస్ పాయింట్ల మేర  తగ్గింది. తద్వారా ఎంసీఎల్ఆర్ కు అనుసంధానమైన గృహ రుణాలు, కారు కొనుగోలు రుణాలు, ఇతర లోన్లు వినియోగదారులకు మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి. ఈ తరహా రుణాలపై వడ్డీరేట్లు తగ్గనుండడమే అందుకు కారణం. ఎస్ బీఐ తాజా నిర్ణయం డిసెంబరు 10 నుంచి అమల్లోకి రానుంది.

More Telugu News