Citizenship Ammendment Bill: పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడంపై లోక్ సభలో ఓటింగ్.. అనుకూలంగా 293 మంది ఓటు

  • వ్యతిరేకంగా ఓటు వేసిన 82 మంది ఎంపీలు
  • ఓటింగ్ లో పాల్గొన్న 375 మంది సభ్యులు
  • లోక్ సభలో చర్చకు రానున్న పౌరసత్వ సవరణ బిల్లు

అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు సభలో ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 375 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొన్నారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా 293 మంది ఎంపీలు ఓటు వేశారు. 82 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో బిల్లు లోక్ సభలో చర్చకు రానుంది. ఈ బిల్లును కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకించాయి. లోక్ సభలో ఎన్డీయేకు కావాల్సినంత సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో, ఈ బిల్లు సభ ఆమోదం పొందడం కష్టమేమీ కాదు. దిగువ సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ ముందుకు బిల్లు వెళుతుంది.

More Telugu News