యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు

09-12-2019 Mon 11:54
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు
  • యాదాద్రి పునర్నిర్మాణ పనులను వివరించిన జగదీశ్ రెడ్డి
  • కాసేపట్లో వరంగల్ కు గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు ఈ రోజు ఉదయం యాదాద్రి నృసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు గవర్నర్ దంపతులకు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, యాదాద్రి ఈవో, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు తమిళిసై దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు తమిళిసై దంపతులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనులను గవర్నర్‌కు జగదీశ్ రెడ్డి, అధికారులు వివరించారు. యాదాద్రి ఆలయానికి గవర్నర్ తమిళిసై రావడం ఇదే తొలిసారి. కాసేపట్లో ఆమె వరంగల్‌ నగరానికి చేరుకొని, అక్కడి కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను పరిశీలించనున్నారు.