AP Assembly: ముగిసిన బీఏసీ సమావేశం.. 7 రోజులు మాత్రమే కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • సమావేశానికి హాజరైన జగన్, అచ్చెన్నాయుడు
  • సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై ప్రధాన చర్చ
  • 17 వరకు సభను నిర్వహించాలని నిర్ణయం

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన కొనసాగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిపక్షం నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నెల 17వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీకి సెలవు. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రారంభమైన సమావేశాలు కేవలం 7 రోజులు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 11, 12, 13, 16, 17 తేదీల్లో సభ సమావేశంకానుంది. మరోవైపు, సభలో దురుసుగా ప్రవర్తిస్తూ వెల్ లోకి సభ్యులు దూసుకురావడంపై కూడా చర్చ జరిగింది. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

More Telugu News