Pakistan: పాకిస్థాన్ ప్రభుత్వం కుప్పకూలబోతోంది: మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్

  • కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు
  • మరో 25 లక్షల మందిని నిరుద్యోగులుగా మార్చారు
  • ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది

పాకిస్థాన్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలబోతోందని ఆ దేశ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ జోస్యం చెప్పారు. దేశ ఆర్థిక స్థితి మెరుగుపడుతోందని ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించిందని... అయితే, ఆ ప్రభుత్వమే ఇప్పుడు మునిగిపోబోతోందని అన్నారు. కోటి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిందని... ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడమే కాకుండా...మరో 25 లక్షల మంది యువతను నిరుద్యోగులుగా మార్చిందని విమర్శించారు. విదేశీ హస్తాల కింద పని చేసే ప్రభ్రుత్వం ఉండాలని ఎవరు కోరుకుంటారని ప్రశ్నించారు. ఇన్నేళ్లుగా విదేశీ శక్తుల ఆధిపత్యం కింద పాకిస్థాన్ నలిగిపోయిందని చెప్పారు. ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.

More Telugu News