Colour Blindness: తన జీవితంలో మొట్టమొదటిసారిగా రంగులను గుర్తించి ఓ బాలుడి భావోద్వేగాలు... వీడియో చూడండి!

  • 12 ఏళ్లుగా వర్ణాంధతతో బాధపడుతున్న బాలుడు
  • ప్రత్యేక కళ్లద్దాలతో రంగుల గుర్తింపు
  • ఆనందంతో కంటతడి

ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజల్లో కొందరు రంగులను గుర్తించలేరు. దాన్నే వర్ణాంధత్వం అంటారు. జన్యులోపం కారణంగా కొందరు పుట్టుకతోనే వర్ణాంధత బారినపడతారు. అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన 12 ఏళ్ల బాలుడు కూడా రంగులను గుర్తించలేని వైకల్యంతో పుట్టాడు. అయితే, వర్ణాంధతతో బాధపడుతున్న వారి కోసం శాస్త్రజ్ఞులు ఎంతో శ్రమించి ప్రత్యేకమైన కళ్లద్దాలు రూపొందించారు. ఇవి ధరిస్తే లోకంలో ఉన్న అన్ని రంగులు కనిపిస్తాయి.

మిన్నెసోటాకు చెందిన బాలుడు కూడా ఈ కళ్లద్దాలు ధరించి ఎదురుగా ఉన్న మనుషులు, వారి ధరించిన దుస్తులు, వస్తువుల రంగులను గుర్తించి ఆనందం పట్టలేకపోయాడు. 12 ఏళ్లుగా అందనిది కళ్లెదురుగా సాక్షాత్కారమైతే తట్టుకోలేక తీవ్రభావోద్వేగాలకు లోనయ్యాడు. కళ్లల్లోంచి నీళ్లు ఉబికివస్తుండగా అదుపు చేసుకోలేకపోయాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News