Aayushmanbahava: ‘ఆయుష్మాన్ భారత్’ కంటే ‘ఆరోగ్యశ్రీ’ ఎంతో మిన్న: మంత్రి ఈటల

  • కోరుట్లలో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
  • మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం
  • ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన నియామకాలు

కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ కన్నా తెలంగాణలోని ‘ఆరోగ్యశ్రీ’ ఎంతో మిన్నగా ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కోరుట్ల పట్టణంలో రూ.16.80 కోట్లతో నిర్మించబోయే వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన నియామకాల ద్వారా సిబ్బందిని అందుబాటులో వుంచుతున్నట్లు చెప్పారు. కాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ప్రాంతీయ ఆసుపత్రిని కూడా ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆయన పరిశీలించారు. వైద్యసేవలు, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

More Telugu News