ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

08-12-2019 Sun 14:02
  • ‘మాట తప్పను మడమ తిప్పను’ అన్న జగన్ యూ టర్న్ తీసుకున్నారు
  • రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో వెనక్కి తీసుకెళ్తున్నారు

ఏపీలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘మాట తప్పను మడమ తిప్పను’ అని నాడు ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్.. సీఎం అయ్యాక ఆర్టీసీ చార్జీలు పెంచి యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో జెట్ స్పీడ్ తో వెనక్కి తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు.