తిరుపతిలో దారుణం. బాలికపై అత్యాచారం!

08-12-2019 Sun 13:56
  • ముళ్లపూడి గ్రామానికి చెందిన బాలికపై అఘాయిత్యం
  • లిఫ్ట్ ఇస్తామంటూ దారుణానికి పాల్పడ్డ వైనం
  • బాలికను నమ్మించి బైక్ పై తీసుకెళ్లిన యువకులు

తిరుపతికి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగింది. రూరల్ మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన ఓ బాలికకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించి ఇద్దరు యువకులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు.

గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులు రాజమోహన్, వెంకటేశ్ ను అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిందితుల్లో ఒకరు రౌడీషీటర్ కాగా, గతంలో ఒక మర్డర్ కేసులో అతని పేరు ఉంది.