మీ కష్టాలు తీరాకే ఈ కొబ్బరి నీళ్లు తాగుతా: పవన్ కల్యాణ్

08-12-2019 Sun 13:47
  • తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత 
  • రైతులతో మాట్లాడిన పవన్ కల్యాణ్
  • కొబ్బరి బోండాం ఇచ్చిన రైతులు
  • తిరిగి ఇచ్చేసిన పవన్

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెలగతోడులో రైతులతో మాట్లాడారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేందంటూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఆయనకు అక్కడి రైతులు ఓ కొబ్బరి బోండాన్ని అందించారు. ఆ కొబ్బరి నీళ్లు తాగాలని సూచించారు.

అయితే, ఆ కొబ్బరి బోండాన్ని తీసుకున్న పవన్ తిరిగి దాన్ని ఇచ్చేశారు. రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో అప్పుడే  కొబ్బరి నీళ్లు తాగుతానని ఆయన చెప్పారు. రైతులను సమస్యలను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన విమర్శలు గుప్పించారు.