బాలా మావయ్యా! 'రూలర్' ట్రైలర్ అదుర్స్: నారా లోకేశ్

08-12-2019 Sun 13:32
  • బాలకృష్ణ నటించిన ‘రూలర్’ మూవీ ట్రైలర్ పై ప్రశంసలు
  • మావయ్చ చెప్పిన డైలాగ్ ‘సూపర్’
  • ‘రూలర్’ దుమ్ములేపుద్దనిపిస్తోంది’

ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ మూవీ ట్రైలర్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. తన మావయ్య బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ‘సూపర్’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ‘సూపర్’, టోటల్ గా 'రూలర్' ట్రైలర్ అదుర్స్’ అని, ‘సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది’ అని లోకేశ్ ఆకాంక్షించారు.