APSRTC: ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారు.. మళ్లీ ఇదొకటా?: ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపుపై సీపీఎం

  • ఓ వైపు ఆర్థికమాంద్యం ప్రభావం తీవ్రంగా ఉంది
  • మరోవైపు సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి
  • పేదల ఆర్థిక స్థితిని మరింత దిగజార్చొద్దు

ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపుపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యావసరాల ధరల పెరుగుదల, ఆర్థికమాంద్యంతో ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో చార్జీల పెంపు తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. చార్జీల పెంపుతో అంతంత మాత్రంగా ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక, చార్జీల పెంపు కారణంగా సరుకు రవాణా మీద కూడా భారం పడుతుందని, దీంతో వాటి ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నష్టాల ఊబిలోంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి తప్పితే చార్జీలు పెంచడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలికారు.

More Telugu News