మెట్రోలో ముద్దుల్లో మైమరచిన జంట!

07-12-2019 Sat 21:37
  • ఢిల్లీ మెట్రోలో ఓ ప్రేమ జంట నిర్వాకం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో
  • వీరి వ్యవహారంపై రైల్వే అధికారుల సీరియస్

ఢిల్లీ మెట్రో రైల్లో విరహం తాళలేక ప్రేమ జంట పబ్లిగ్గా రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది. మరోవైపు దీన్ని తోటి ప్రయాణికులు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

 వీరి వ్యవహారాన్ని కొంతమంది ప్రయాణికులు ఆక్షేపిస్తూ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పబ్లిక్ గా వీరు వ్యవహరించిన తీరు సబబు కాదని విమర్శించారు. కాగా, ఈ జంటకు సంబంధించి రికార్డయిన వీడియోను పరిశీలిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. వారిని గుర్తించి తగిన చర్యలు చేపడతామని అధికారులు చెప్పినట్లు సమాచారం