నిర్మాణ కౌశలానికి ప్రతీకలా రాజస్థాన్ కొత్త హైకోర్టు భవనం... ఓ లుక్కేయండి!

07-12-2019 Sat 21:08
  • సరికొత్త డిజైన్ లో రాజస్థాన్ హైకోర్టు
  • నిర్మాణానికి రూ.316 కోట్ల వ్యయం
  • ప్రారంభించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

జోథ్ పూర్ లో కొత్తగా నిర్మించిన రాజస్థాన్ హైకోర్టు భవన సముదాయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు. జోథ్ పూర్ నగర శివార్లలో నిర్మాణం జరుపుకున్న ఈ హైకోర్టుకు రూ.316 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఉన్న ఇతర హైకోర్టుల కంటే ఇది నిర్మాణ పరంగా భిన్నంగా ఉండడమే కాదు, సౌకర్యాల రీత్యా అత్యుత్తమం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా, పాత హైకోర్టు నుంచి ఫైళ్లు, ఇతర రికార్డులు తరలించడానికి 60 ట్రక్కులు కావాల్సి వచ్చింది.

వాస్తవానికి ఈ హైకోర్టు సెప్టెంబరులో ప్రారంభించాలనుకున్నారు. ఆ సమయంలో సీజేఐగా ఉన్న రంజన్ గొగోయ్ ను కూడా ఆహ్వానించాలని భావించారు. కానీ ప్రారంభోత్సవం వాయిదాపడడం, రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సీజేఐ ఎస్ఏ బోబ్డే ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. కాగా, ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా హాజరయ్యారు.