RBI former governor Raghuram Rajan: రియల్, నిర్మాణ రంగాలు సంక్షోభంలో ఉన్నాయి: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

  • గ్రామీణ ప్రాంతాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి
  • నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల ఆస్తుల నాణ్యతపై ఆర్బీఐ సమీక్షించాలి
  • దేశంలో వృద్ధి మాంద్య పరిస్థితులు నెలకొన్నాయి

దేశ ఆర్థిక వ్యవస్థపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని చెప్పారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇండియా టుడే పత్రికకు రాసిన కాలమ్ లో రాజన్ ఈ వివరాలను వెల్లడించారు.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల ఆస్తుల నాణ్యతపై ఆర్బీఐ సమీక్ష చేపట్టాలని సూచించారు. నిర్మాణ రంగ, మౌలిక సదుపాయాల పరిశ్రమలకు ఈ సంస్థలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయని తెలిపారు. దేశంలో వృద్ధి మాంద్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ కారణంతోనే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనంలో ఉందని.. నిరుద్యోగిత పెరుగుతోందన్నారు. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో భారత్ జీడీపీ 4.5 శాతానికి తగ్గిందంటూ.. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయని చెప్పారు.

More Telugu News