Supreme Court: న్యాయ ప్రక్రియ ప్రతీకార రూపంలో ఉండరాదు: సుప్రీంకోర్టు సీజే బాబ్డే

  • రేప్ కేసుల్లో సత్వర న్యాయం అందించాలన్న  కేంద్ర మంత్రి 
  • ఆ వ్యాఖ్యలతో విభేదించిన బాబ్డే 
  • నేరానికి హడావిడిగా శిక్ష విధిస్తే న్యాయానికి అర్ధముండదు

దేశంలో మహిళలపై అత్యాచారాలు, హింస తదితర నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే స్పందించారు. సత్వర న్యాయం రూపేణ జరుగుతున్న ఎన్ కౌంటర్లపై బాబ్డే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. న్యాయమనేది ప్రతీకారంగా మారితే అది తన లక్షణం కోల్పోతుందని పేర్కొన్నారు. సత్వర న్యాయం సాధ్యం కాదన్నారు. నేరానికి హడావిడిగా  శిక్ష విధిస్తే న్యాయానికి అర్ధముండదని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.

రాజస్థాన్ లోని జోద్ పూర్ లో హైకోర్టు భవనం ప్రారంభోత్సవంలో బాబ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేప్ కేసుల్లో సత్వర తీర్పులు చెప్పాలన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలతో సీజేఐ విభేదించారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకత కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యాయం అనేది ప్రతీకారంగా మారకూడదని చెప్పారు. నిందితుడు నేరం చేశాడన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్న నేపథ్యంలో బాబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం నిందితులకు కూడా కొన్ని హక్కులుంటాయని ఆయన అన్నారు.

More Telugu News