Kala Venkatrao: దాడి చేసిన వారిని వదిలేసి బస్సును సీజ్ చేయడమేంటి?: కళా వెంకట్రావు

  • అమరావతి పర్యటనలో చంద్రబాబుపై దాడి
  • సీఎం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని కళా హితవు
  • హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని అమరావతిలో పర్యటించగా, ఆయన కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులతో దాడి జరిగింది. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు. రాజధాని పర్యటనలో చంద్రబాబుపై దాడి చేయించింది ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. విపక్షాలపై కక్షసాధింపు చర్యలు పక్కనబెట్టి, సీఎం రాష్ట్రపాలనపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు.

అయినా, ప్రతిపక్ష నేతపై దాడి చేసిన వారిని వదిలేసి, బస్సును సీజ్ చేయడమేంటని నిలదీశారు. దర్యాప్తు పేరుతో తొమ్మిదిరోజుల పాటు బస్సును వారి అధీనంలో ఉంచుకుని, బస్సు యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా బస్సును యజమానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కళా వెంకట్రావు లేఖ రాశారు.

More Telugu News