priyanka gandhi: మహిళలపై దాడులను అరికట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది?: ప్రియాంకా గాంధీ విమర్శలు

  • గతంలో జరిగిన ఉన్నావో అత్యాచార ఘటన నుంచి ఏమీ నేర్చుకోలేదు
  • రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలికి ఎందుకు భద్రత కల్పించలేకపోయింది?
  • ఎఫ్ఐఆర్ నమోదు చేయని అధికారిపై ఏ చర్యలు తీసుకున్నారు?  

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న అత్యాచారం కేసులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో మరో ఘటన కలకలం రేపింది. అత్యాచార బాధిత మహిళను నిందితులు సజీవ దహన యత్నం చేయగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అత్యాచార బాధితురాలిని హత్య చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందించారు. 2017లో జరిగిన అత్యాచారం ఘటన నుంచి ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని విమర్శలు గుప్పించారు.

'గతంలో ఉన్నావోలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం బాధితురాలికి ఎందుకు భద్రత కల్పించలేకపోయింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని అధికారిపై ఏ చర్యలు తీసుకున్నారు? ఉత్తరప్రదేశ్ లో మహిళలపై జరుగుతోన్న దాడులను అరికట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?' అని ఆమె నిలదీశారు. ఉన్నావో అత్యాచార బాధితురాలి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు అదుపుతప్పాయని విమర్శించారు.

More Telugu News