onion price: ఉల్లి లొల్లికి ఏపీ సర్కారు చికిత్స.. ధర దిగివచ్చే అవకాశం

  • ఎగుమతులు నిలిపివేసిన అధికారులు
  • కొన్ని చోట్ల లారీలతో ఉల్లి సీజ్
  • కర్నూలు మార్కెట్ లో ఇప్పటికే తగ్గిన ధర

ఉల్లి ధర ఆకాశాన్నంటడంతో సతమతమవుతున్న ఏపీలోని వినియోగదారులకు శుభవార్త. రెండు మూడు రోజుల్లో ఉల్లి ధరలు దిగివచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయి. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర రూ.150లకు చేరిన నేపథ్యంలో ధరల అదుపునకు ఏపీ సర్కారు చికిత్స మొదలు పెట్టడంతో ప్రయోజనం కనిపిస్తోంది. 

ముఖ్యంగా రాష్ట్ర అవసరాలు తీరకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతులపై నిషేధం విధించడంతో దాని ప్రభావం మార్కెట్ పై కనిపిస్తోంది. కర్నూలులో ఒక దశలో క్వింటాల్ ఉల్లి ధర 12 వేల రూపాయలు దాటింది. అటువంటిది ఈ రోజు 8,600 పలికింది. పలుచోట్ల లారీలతో తరలిపోతున్న ఉల్లిని కూడా అధికారులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉల్లి నిల్వలు పెరిగి మార్కెట్ కు అందుబాటులోకి రానున్నాయి. దీంతో డిమాండ్ మేరకు సరఫరా పెరిగితే ధర తగ్గుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News